Home  »  TV News  »  Karthika Deepam2 : జ్యోత్స్న కిడ్నాప్ డ్రామాలో హై వోల్టేజ్ ట్విస్ట్.. పోలీసులకు షాకిచ్చిన వైరా!

Updated : Apr 23, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -651 లో..... జ్యోత్స్న కిడ్నాప్ అయిందని సుమిత్ర ఏడుస్తుంది. ఎన్ని కోట్లు అయినా సరే జ్యోత్స్న ఇంటికి సేఫ్ గా రావాలని సుమిత్ర అంటుంది. అంటే మీరు డబ్బులు ఇచ్చి క్రిమినల్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారా అని ఆఫీసర్స్ సుమిత్రతో అంటారు. ప్లీజ్ మమ్మల్ని ఇలా వదిలెయ్యండి అని సుమిత్ర అంటూ కిందపడిపోతుంటే దీప పట్టుకుంటుంది. దాంతో వదిలేయ్ అని దీపని సుమిత్ర  కోపంగా అంటుంది.. ఇప్పుడు కిడ్నాపర్స్ ఫోన్ చేస్తారు కదా అప్పుడు డిసైడ్ అవ్వొచ్చని దశరథ్ అంటాడు.

మరొకవైపు జ్యోత్స్న ఇడ్లీ తింటూ చట్నీ బాలేదని వైరాతో అంటుంది. అయితే కొబ్బరి చట్నీ చేయించనా అని వైరా అనగానే ఇప్పుడు కావల్సింది కొబ్బరి చట్నీ కాదు.. కోట్లు అని జ్యోత్స్న అంటుంది. మా డాడీ వాళ్ళు నీ ఫోన్ కోసం వెయిటింగ్ అనుకుంటా.. ఫోన్ చెయ్ అని వైరాతో జ్యోత్స్న అంటుంది. దశరథ్ కి వైరా కాల్ చేస్తాడు. డబ్బులు సిద్ధంగా ఉన్నాయి ఎక్కడికి రావాలో చెప్పండి అని దశరథ్ అనగానే స్మార్ట్ గా ఆలోచించకండి మీ పక్కన పోలీసులున్నారని అర్థమవుతుంది. మీరు పోలీసులతో వస్తే మీ జ్యోత్స్న ఉండదని వైరా అంటాడు. నువ్వు ఒక్కడివే డబ్బులు పట్టుకొని ఇంటి నుండి ముందు బయల్దేరు దశరథ్ తో వైరా అంటాడు. దశరథ్ డబ్బులు పట్టుకొని బయల్దేరతాడు. దశరథ్ కి తెలియకుండా దాస్, పోలీసులు తన కార్ ని ఫాలో అవుతారు. మరొకవైపు పారిజాతం, కార్తీక్ కూడా స్కూటీపై వాళ్ళని ఫాలో అవుతారు.

కొద్ది దూరం వెళ్ళాక దశరథ్ కి వైరా కాల్ చేసి కార్ ఆపి దిగి కొద్ది దూరం వెళ్ళమని అంటాడు. దాంతో దశరథ్ కార్ ఆపి దిగి వెళ్తాడు. మాట్లాడుతుండగానే దశరథ్ కార్ ని ఎవరో తీసుకొని వెళ్తారు. వైరా కాల్ కట్ చేస్తాడు. పోలీసులతో వస్తున్న దాస్ దశరథ్ దగ్గరికి వెళ్లి ఏమైందని అంటాడు. జ్యోత్స్న గురించి అడిగేలోపే కట్ చేశారని దశరథ్ అంటాడు. దశరథ్, దాస్ వాళ్ళు వస్తున్న కార్ లో వాళ్ళతో వెళ్ళిపోతాడు. వాళ్ళ కార్ ఫాలో అవుతూనే కార్తీక్, పారిజాతం వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.